Idi Na Jeevithalapana Song Lyrics in Telugu | ఇది నా జీవితాలాపన | వీడియో సాంగ్ | సువర్ణ సుందరి | చంద్ర మోహన్ | జయ శ్రీ | జగ్గయ్య | Suvarna Sundari | Ramesh Naidu

Movie Title:-సువర్ణ సుందరి 
Cast Crew:- చంద్ర మోహన్, జయశ్రీ 
Music:- 
Year:-
 

అతడు: ఆ ఆ 
ఆమె: ఆ ఆ
అతడు: ఆ  
ఆమె: ఆ ఆ
అతడు
ఇది నా జీవితాలపనా
ప్రియ దేవతాన్వేషణా
ఏమైనదో... ఎట దాగున్నదో
ఏమైనదో... ఎట దాగున్నదో
ఎన్నాళ్ళు ఈ వేదనా
ఎన్నాళ్ళు ఈ వేదనా ఆ
ఇది నా జీవితాలపనా
ప్రియ దేవతాన్వేషణా

పొలిమేర దాటాను దావానలో
పొలికేక నైనాను రాగాలలో
శున్యాక్షరాల గవాక్షాలలో
శున్యాక్షరాల గవాక్షాలలో
నిలిచాను నిరుపేద గీతాలతో
మది గాయలుగా మధు గేయాలుగా
మది గాయలుగా మధు గేయాలుగా
ఎన్నాళ్ళు ఈ వేదనా
ఎన్నాళ్ళు ఈ వేదనా ఆఆ
ఇది నా జీవితాలపనా
ప్రియ దేవతాన్వేషణా
ఆమె
మంజీరమైనాను నీ పాటలో
మందారమైనాను నీ తోటలో
మౌనస్వరాలపంజరాన
మౌనస్వరాలపంజరాన
కరిగాను కడలేని స్వప్నాలలో
విధి నటనాలలో ఋతుపవనాలలో
విధి నటనాలలో ఋతుపవనాలలో
అతడు
ఎన్నాళ్ళు ఈ వేదనా
ఎన్నాళ్ళు ఈ వేదనా అఆఆఆ 
ఇది నా... జీవితాలపనా
ప్రియ దేవతాన్వేషణా
ఆమె
నీ అంతిమ శ్వాస నీ కవితలో ప్రాస
అవుతుందనీ బాస చేసానులే
కావాలనే బ్రతికి ఉన్నాను లే
ఉంటానులే
నీ సంగామావేశ విజృంభణంలోన
ఆకాశమే తుంచి కైలాసమే వంచి
నిను చేరుకుంటాను నీనాదమై

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు